జగ్జీవన్రామ్ బాటలో నడవాలి : అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ 

జగ్జీవన్రామ్ బాటలో నడవాలి : అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ 

వికారాబాద్, వెలుగు: బాబు జగ్జీవన్ రామ్ సూచించిన మార్గంలో మనమందరం నడవాలని శాసనసభ స్పీకర్​గడ్డం ప్రసాద్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాబూజీగా ప్రసిద్ధి చెందిన జగ్జీవన్ రామ్ స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.

కేంద్రంలో వివిధ శాఖల మంత్రిగా, ఉప ప్రధానిగా సుదీర్ఘకాలం దేశానికి సేవలందించారని పేర్కొన్నారు. బీజేఆర్ చౌరస్తాలోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి స్పీకర్ తో పాటు కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహ మెహ్రా, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ గడ్డం అనన్య, వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.